ఏ కల కోరి , అడుగిటు పదేనో?
ఏ దరి గూర్చి, నావిటు సాగేనో?
దిసలె తప్పి, ముప్పని తెలిసి,
ఆగక సాగక సతమౌతూ,
చుట్టూ మన్నే కనపడుతున్నా,
తీరం కోరి అడుగేస్తున్న...
అదిగో అల్లంత దూరం లోన,
కొలను ల నీరే కనపడుతున్నా,
ఆఘ మేఘాన అడుగులు సాగినా,
దూరం దరికీ రానని అందే...
ఎమీమాయని అలసిన మేనిని,
అడుగుల వేగం నిలిపిన నయమని,
ఎటుకై చూచిన విధి వల కలదని,
ఆ భ్రమలో బ్రతుకును బలికానివ్వకని...
గమ్యం తెలియనీ పయనం లోన,
వ్యర్ధం అయఎనీ ఉరకల లోన,
తీరం కనపడు తరుణం ఎపుదని?
కనపడు తీరం చేరేదేన్నాడని?
విధాత అడిగిన బదులే లేక,
అడుగులు సాగేనే నిలుపను లేక!!!
Ye kala kori adugitu padeno?
ye dari goorchi naavitu saageno?
disale thappi, muppani telisi,
aagaka saagaka satamoutu,
chuttu mannae kanapaduthunna,
teeram kori adugesthunna...
adigo allantha dooram lona,
kolanu la neerae kanapaduthunna,
aagha meghana adugulu saagina,
dooram darikae raanani andae...
yemeemayani alasina menini,
adugula vegam nilipina nayamani,
yetukai chuchina vidhi vala kaladani
aa bhrama lo brathukunu balikanivvakani...
gamyam teliyanee payanam lona,
vyardham ayyenee urakalalona,
teeram kanapadu tarunam yepudani?
kanapadu teeram cheredennadani?
vidhatanadigina badulae laeka,
adugulu saagene nilupanu laeka!!!
This comment has been removed by the author.
ReplyDelete